ETV Bharat / international

కశ్మీర్​పై ప్రపంచ దేశాల మద్దతుకు పాక్​ యత్నాలు - ప్రపంచ దేశాలు

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది పాకిస్థాన్​. ఇప్పటికే పలు దేశాధినేతలతో చర్చలు జరిపిన ఇమ్రాన్​ఖాన్​ తాజాగా ఇండేనేసియా అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపారు.

కశ్మీర్​పై ప్రపంచ దేశాల మద్దతుకు పాక్​ ప్రయత్నం
author img

By

Published : Aug 13, 2019, 9:38 AM IST

Updated : Sep 26, 2019, 8:18 PM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దును మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్​.. ఈ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పాలని పలు దేశాధినేతలతో చర్చలు జరుపుతోంది. కశ్మీర్​ అంశంపై తాజాగా ఇండోనేసియా అధ్యక్షుడితోనూ ఫోన్​లో సంభాషించారు పాక్​​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. 370 అధికరణ రద్దుతో అమాయకులైన కశ్మీర్​ ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని జోకో విడోడోకు వివరించారు ఇమ్రాన్​. కశ్మీర్​ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని కోరినట్లు సమాచారం.

ఇదే అంశంపై ఇంగ్లాండ్​, మలేసియా ప్రధానులతో పాటు టర్కీ అధ్యక్షుడు, సౌదీ యువరాజుతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు పాక్ ప్రధాని. ఆర్టికల్​ 370 రద్దుపై అభ్యంతరాలు లేవనెత్తిన పాకిస్థాన్ సర్కార్​.. భారత్​తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకునే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్​లోని భారత హైకమిషనర్​ అజయ్ బిసారియాను బహిష్కరించింది. సంఝౌతా ఎక్స్​ప్రెస్ రద్దుతో పాటు భారత్​కు పాక్​ హైకమిషనర్​ రాకుండా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:హాంగ్​కాంగ్​ హింసాయుతం- రవాణా బంద్!

AP Video Delivery Log - 0100 GMT News
Tuesday, 13 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0017: Guatemala Election Reaction AP Clients Only 4224812
Giammattei win sparks muted response in Guatemala
AP-APTN-2319: Venezuela Political Crisis AP Clients Only 4224809
Venezuela court seeks to lawmakers of protection
AP-APTN-2310: Hong Kong Airport AP Clients Only 4224808
Hong Kong airport reopens after protest disruption
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.