ETV Bharat / international

ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా - పాక్​ ఆరోగ్య మంత్రి జాఫర్​ మిర్జా

పాకిస్థాన్​ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్​ మిర్జాకు కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

Pakistan's health minister tests positive for COVID-19
ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Jul 6, 2020, 4:22 PM IST

పాకిస్థాన్​లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మిర్జాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు.

"నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు వైరస్​ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. నా కోసం భగవంతుడ్ని ప్రార్థించండి."

-జాఫర్​ మిర్జా, పాక్​ ఆరోగ్య శాఖ మంత్రి.

శుక్రవారం పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషీకి కూడా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాయాది దేశానికి చెందిన పలువురు చట్టసభ్యులు వైరస్​ బారిన పడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థాన్​లో ఇప్పటివరకు 2,31,818 మందికి వైరస్​ సోకగా.. 4,762 మంది బలయ్యారు.

ఇదీ చూడండి:అమెరికాలో కార్చిచ్చు- 400 ఎకరాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.