ETV Bharat / international

మాజీ ప్రధాన మంత్రిపై మరో అవినీతి కేసు

పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై కొత్తగా మరో అవినీతి కేసును నమోదు చేసింది అక్కడి నేషనల్​ అకౌంటబిలిటీ బ్యూరో. నవాజ్​ను నేరస్థుడిగా ప్రకటించాలని అవినీతి నిరోధక కోర్టును ఆశ్రయించింది. 34 ఏళ్ల క్రితం నాటి భూముల అక్రమ కేటాయింపు కేసులో సమన్లు జారీ చేసినా ఆయన నుంచి స్పందన లేదని పేర్కొంది. ప్రస్తుతం షరీఫ్​ లండన్​లో తలదాచుకుంటున్నారు.

Pakistan's anti-graft body files fresh corruption case against Nawaz Sharif
పాక్​ మాజీ ప్రధానిపై కొత్తగా మరో అవినీతి కేసు
author img

By

Published : Jun 27, 2020, 8:51 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్​ సహా మరో ముగ్గురిపై కొత్తగా అవినీతి కేసు నమోదు చేసింది అక్కడి అవినీతి నిరోదక సంస్థ. 34ఏళ్ల క్రితం నాటి అక్రమ భూ కేటాయింపుల కేసులో సంబంధమున్నందుకు ఈ మేరకు చర్యలు చెేపట్టింది. అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది.

షరీఫ్​ ప్రస్తుతం లండన్​లో ఉన్నారు. చికిత్స నిమిత్తం అక్కడకు వెళ్లేందుకు నవంబరులో లాహోర్​ కోర్టు అనుమతిచ్చింది.

పనామా పేపర్స్​ కేసులో నవాజ్​ షరీఫ్​ను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ 2017 నవంబరులో తీర్పునిచ్చింది పాక్ సుప్రీంకోర్టు. అప్పటి ఆయనపై పలు కేసులు నమోదు చేసింది ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ప్రభుత్వం.

పాక్​లోని పంజాబ్ రాష్ట్రంలో 34 ఏళ్ల క్రితం నాటి అక్రమ భూ కేటాయింపుల కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినా నవాజ్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదని అవినీతి నిరోదక కోర్టును తాజాగా ఆశ్రయించింది పాక్​ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(న్యాబ్​). నవాజ్​ను నేరస్థుడిగా ప్రకటించాలని కోరింది. ఈ కేసుతో సంబంధమున్న మరో ముగ్గురిపైనా అభియోగాలు మోపింది.

1986 నాటి కేసు..

1986లో పాక్​లోని పంజాబ్​ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా 54-కెనాల్ భూమిని షకీల్​ రెహమాన్​కు కేటాయించారు నవాజ్​. అందుకు ప్రతిగా ఆయనకు విలాసవంతమైన వాహనాలు బహుమతిగా అందాయి. ఈ కేసులో విచారణకు హాజరు కాలేదని మే 29న అరెస్టు వారెంట్ జరీ చేసింది న్యాబ్​.

లండన్​లో..

అల్​-అజీజ్​ మిల్స్ అవినీతి కేసులో 7ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​కు గతేడాది నవంబరులో బెయిల్​ మంజూరు చేసింది లాహోర్​ కోర్టు. అనారోగ్యానికి గురైన ఆయనకు లండన్​లో నాలుగు వారాల పాటు చికిత్స తీసుకునేందుకు అనుమతిచ్చింది.

అప్పుడు లండన్​ వెళ్లిన నవాజ్​ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. గత నెలలో ఆయన లండన్​ వీధుల్లోని ఓ రెస్టారెంట్లో మనవరాళ్లతో కలిసి టీ తాగుతున్న ఫొటో ఒకటి లీకై సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. అంతకు ముందు కూడా ఇదే తరహా ఫొటో బయటకు వచ్చింది. తన తండ్రికి జరగాల్సిన శస్త్ర చికిత్స కరోనా కారణంగా వాయిదా పడిందని నవాజ్​ కూతురు వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి: భారతీయ-అమెరికన్ల మద్దతు పట్ల ట్రంప్ ఖుషీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.