ETV Bharat / international

పాకిస్థాన్​కు మళ్లీ షాక్​- మరికొన్నాళ్లు 'గ్రే' జాబితాలోనే - ఎఫ్​ఏటీఎఫ్​ జాబితాలో పాకిస్థాన్​

పాకిస్థాన్​​ 'గ్రే' జాబితాలోనే కొనసాగుతుందని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ తెలిపింది. నిర్దేశించిన మొత్తం 34 విధుల్లో 30 విధులను మాత్రమే నిర్వర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

paksitan fatf
ఎఫ్​ఏటీఎఫ్​ జాబితాలో పాకిస్థాన్​
author img

By

Published : Oct 21, 2021, 10:40 PM IST

Updated : Oct 21, 2021, 10:54 PM IST

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని 'గ్రే' లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​(ఎఫ్​ఏటీఎఫ్​) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులను మాత్రమే నిర్వర్తించినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్చవల్​గా నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ తెలిపారు.

పాకిస్థాన్​ ఇప్పటివరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కీలకమైన చర్యలు చేపట్టిందని ఎఫ్​ఏటీఎఫ్​ తెలిపింది. అయితే.. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్​ సాయిద్, మసూద్ అజర్ సహా వారి బృందాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను పాక్​ మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఎఫ్​ఏటీఎఫ్​ పేర్కొంది.

'గ్రే' జాబితా నుంచి మారిషస్, బోట్స్వానా దేశాలను ఎఫ్​ఏటీఎఫ్​ తొలిగించింది. ఈ నేపథ్యంలో ఆ దేశాలకు మార్కస్ ప్లీయర్ అభినందనలు తెలిపారు. మరోవైపు.. జోర్డాన్​, మాలీ, టర్కీ దేశాలను తమ​ జాబితాలో చేర్చుతున్నట్లు ఎఫ్​ఏటీఎఫ్ తెలిపింది. ఈ మూడు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యచరణ చేపట్టడానికి అంగీకరించాయని చెప్పింది.

ఇదీ చూడండి: Afgan taliban: అఫ్గాన్​లో మహిళల నిరసనలు హింసాత్మకం!

ఇదీ చూడండి: రెస్టారెంట్​లో భారీ పేలుడు- నలుగురు మృతి

Last Updated : Oct 21, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.