ETV Bharat / international

పాక్​లో టీఎల్​పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్పీ కిడ్నాప్​ - టీఎల్​పీ కార్యకర్తల బీభత్సం.. డీఎస్​పీ కిడ్నాప్​!

పాకిస్థాన్​ లాహోర్​లోని ఓ పోలీస్​ స్టేషన్​పై నిషేధిత తెహ్రీక్​-ఇ-లబైక్​ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. డీఎస్పీ సహా ఐదుగురు పోలీసులను కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన పోలీసులనూ చితకబాదారు.

TLP supporters
టీఎల్​పీ కార్యకర్తల బీభత్సం
author img

By

Published : Apr 18, 2021, 7:21 PM IST

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిషేధిత తెహ్రీక్-ఇ-లబైక్​ పార్టీ(టీఎల్​పీ) కార్యకర్తలు రెచ్చిపోయారు. నిషేధాన్ని ఎత్తివేయాలని నిరసిస్తూ లాహోర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి, డీఎస్పీ సహా ఐదుగురు పోలీసులను కిడ్నాప్‌ చేశారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు. పొగబాంబులతో దాడి చేశారు.

TLP supporters
లాహోర్​లో పోలీస్​ స్టేషన్​పై దాడి
TLP supporters
టీఎల్​పీ కార్యకర్తల ఘర్షణ
TLP supporters
పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన టీఎల్​పీ కార్యకర్త

ఈ క్రమంలో 50 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్‌ ట్యాంకర్‌ను అపహరించినట్లు పాక్​లోని పంజాబ్‌ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టీఎల్​పీ కార్యకర్తలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 11 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలిపారు. డీఎస్పీ సహా మరో ఐదుగురు పోలీసులను ఓ మసీదులో ఉంచినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పబ్​లో పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.