ETV Bharat / international

పాక్​ ఎత్తుగడ- భారత్‌కు చేరువలో క్షిపణి మోహరింపు - Indian border

ప్రపంచదేశాలు కరోనాతో అల్లాడుతుంటే.. దాయాది పాకిస్థాన్​ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ఓ వైపు జమ్ము కశ్మీర్ వద్ద​ నియంత్రణ రేఖ వెంబడి వరుసగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తున్న పాక్​.. తాజాగా తన క్షిపణి వ్యవస్థను మన దేశ సరిహద్దులకు చేరువగా తీసుకొచ్చింది.

Pakistan moves LY-80 strategic missiles closer to Indian border
పాక్​ క్షిపణి ఎత్తుగడ-భారత్‌కు చేరువలో మోహరింపు
author img

By

Published : Apr 28, 2020, 7:36 AM IST

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమై ఉంటే.. పాకిస్థాన్‌ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దుష్ట పన్నాగాలను పన్నుతోంది. తాజాగా తన క్షిపణి వ్యవస్థను మన దేశ సరిహద్దులకు చేరువగా తీసుకొచ్చింది. ప్రపంచం దృష్టిని మళ్లించడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పాక్‌ తన ఎల్‌వై-80 క్షిపణి వ్యవస్థను లాహోర్‌ నగర శివార్లలో మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. భారత్‌-పాక్‌ సరిహద్దులకు ఇది కేవలం 22.53 కిలోమీటర్ల దూరంలోనే ఉందని సీనియర్‌ సైనికాధికారి ఒకరు ఈటీవీ భారత్​’కు తెలిపారు. రెండు దేశాలూ కొవిడ్‌-19పై పోరులో నిమగ్నమైన తరుణంలో పాక్‌ ఈ చర్యను చేపట్టడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

చైనాలో తయారీ..

ఎల్‌వై-80 లేదా హెచ్‌క్యూ16ఏ అనే ఈ క్షిపణి వ్యవస్థ చైనాలో తయారైంది. ఇది మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థ. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 40 కిలోమీటర్ల దూరం నుంచి విమానాలను నేలకూల్చగలదు. ఈ క్షిపణులు గంటకు 600 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలవు. కొవిడ్‌-19 అంశం నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకే పాక్‌ ఈ క్షిపణి మోహరింపును చేపట్టిందని రక్షణ అంశాల విశ్లేషకుడు జె.కె.వర్మ పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యలను పాకిస్థాన్‌ ప్రజలు సరిగా పాటించడం లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.