కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా పాకిస్థాన్ ప్రభుత్వం 12 దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వైరస్ స్ట్రెయిన్ల ఉద్ధృతిని అదుపు చేసేందుకు పాక్ పౌర విమానయాన శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దేశాలను మూడు కేటగిరీలుగా విభజించి వాటి రాకపోకలపై ఉండే ఆంక్షలను వెల్లడించింది పాక్. సీ కేటగిరీలోని 12 దేశాల విమానాలపై మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.
బోత్సువానా, బ్రెజిల్, కొలంబియా, కొమొరొస్, ఘన, కెన్యా, మొజాంబిక్, పెరు, రువాండా, దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబియా దేశాలను 'సీ' కేటగిరీగా పేర్కొంది.