అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు కరోనాతో ఆ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ జీడీపీని కాాపాడుకునేందుకు ఇంధన ధరలను రికార్డు స్థాయిలో పెంచనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తుల అధారంగా 22నుంచి 66శాతం మేర చమురు ధరలు పెరిగే అవశామున్నట్లు తెలిపింది.
కరోనా సంక్షోభం కారణంగా పాక్ జీడీపీ వృద్ధి తొలిసారి 0.4 శాతం క్షీణించనున్నట్లు రెండు వారాల క్రితమే తెలిపింది ప్రభుత్వం. మొదట 2.4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ.. కరోనా దెబ్బకు పరిస్థితులు తలకిందులయ్యాయి. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా క్షీణిస్తోంది.
ఇంధన ధరలు పెంచాలనే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కట్టడికి మార్చిలో లాక్డౌన్ ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్. అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. మే నెలలో ఆంక్షలను సడిలించారు. ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 4వేల 35మంది ప్రాణాలు కోల్పోయారు.