ETV Bharat / international

వ్యాక్సిన్​ కోసం రూ.742 కోట్లు కేటాయించిన పాక్ - డాక్టర్​. అసద్ హఫీజ్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్​ కొనుగోలుకు దాదాపు రూ. 742 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.

Pak_Covaxin
వ్యాక్సిన్​ కోసం రూ.742 కోట్లు కేటాయించిన పాక్
author img

By

Published : Nov 18, 2020, 4:24 PM IST

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి రాగానే... త్వరితగతిన టీకా కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్​ దాదాపు రూ. 742 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. బుధవారం నాటికి కొవిడ్ కేసుల సంఖ్య 3,63,380కి పెరిగినందున పాక్​ ఈ నిర్ణయం తీసుకుంది.

కొవిడ్​ కట్టడి దృష్ట్యా.... వృద్ధులకు, వైద్య సిబ్బందికి ముందుగా కరోనా టీకాలు అందించనునున్నట్లు ఓ పాకిస్థాన్​ పత్రిక పేర్కొంది.

'ధర.. అంచనా వేయలేం!'

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని పాక్​ జాతీయ వ్యాక్సిన్ తయారీ కమిటీ ఛైర్మన్ డాక్టర్​ అసద్ హఫీజ్ అన్నారు. ఈ మేరకు.. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతోందని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొవిడ్ వ్యాక్సిన్ ధర అంచనా వేయలేమని ఓ ఆరోగ్య శాఖ అధికారి అన్నారు. వ్యాక్సిన్​ పూర్తిగా ఉచితంగా లభిస్తుందనే ఆశతో ఉండకూడదని పేర్కొన్నారు.

బుధవారం నాటికి పాకిస్థాన్​లో 30,362 యాక్టివ్​ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 37 మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 7,230కి పెరిగింది.

ఇదీ చదవండి:బైడెన్‌ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.