కశ్మీర్(Jammu and Kashmir) తమ అంతర్గత వ్యవహారమని భారత్ తేల్చిచెబుతున్నప్పటికీ.. పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. తాజాగా.. ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కశ్మీర్(Jammu and Kashmir) అంశంపై చర్చిస్తానని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
"సమయం లభిస్తే.. 2022 మార్చిలో ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చ జరుపుతాం. కశ్మీర్ అంశంపై చర్చించి వారి మద్దతు కూడగడతాం."
--షా మహమ్మద్ ఖురేషి, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
కించపరచొద్దు..
అఫ్గానిస్తాన్ తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖురేషి ఆరోపించారు. పాక్ ఓ వ్యభిచార గృహం అంటూ అఫ్గాన్ జాతీయ భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:పాక్లో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ మండిపాటు