ETV Bharat / international

స్వదేశీ క్షిపణి వ్యవస్థను పరీక్షించిన పాక్

author img

By

Published : Jan 7, 2021, 7:42 PM IST

పాకిస్థాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థను గురువారం విజయవంతంగా పరీక్షించింది. 140 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని రూపొందించినట్లు తెలిపింది.

Pakistan successfully test fires indigenously developed weapons rocket system
మల్టీ గైడెడ్ మిస్సైల్​ని ప్రయోగించిన పాక్

పాకిస్థాన్​ దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఫతా-1' క్షిపణి వ్యవస్థను గురువారం ప్రయోగించింది. 140కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. సంప్రదాయ వార్​హెడ్​లను మోసుకెళ్లగలిగేలా దీనిని రూపొందించింది పాక్.

ఈ ప్రయోగ విజయంతో తమ ఆయుధ సామర్థ్యం మరింత పెరిగుతుందని పాకిస్థాన్​ ఆర్మీ మేజర్​ జనరల్​ బాబర్ ఇఫ్తికర్​ తెలిపారు. శత్రు దేశాల భూభాగంలోని లక్ష్యాలను సైతం సులువుగా ఛేదించవచ్చని పేర్కొన్నారు.

ఈ​ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన సైన్యాన్ని, శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా అభినందించారు.

ఈ ప్రయోగానికి సంబంధించి పూర్తి వివరాలను పాక్​ వెల్లడించలేదు.

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి రూ.28,400కోట్ల ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.