ETV Bharat / international

'కర్తార్​పుర్​​ కారిడార్​పై పాకిస్థాన్​ కొర్రీలు' - sikku

కర్తార్​పుర్​ కారిడార్​ను ఏడాది పొడవునా తెరచి ఉంచాలన్న భారత్​ ప్రతిపాదనను తోసిపుచ్చింది పాకిస్థాన్​. కారిడార్​పై పలు షరతులు విధించింది. రోజుకు 700 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది.

'కర్తాపుర్​ కారిడార్​పై పాకిస్థాన్​ కొర్రీలు'
author img

By

Published : Jun 23, 2019, 7:11 AM IST

Updated : Jun 23, 2019, 7:32 AM IST

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కర్తార్​పుర్​ యాత్రపై కొర్రీలు పెడుతోంది పాకిస్థాన్​. యాత్రికులను ఏడాది పొడవునా అనుమతించాలన్న భారత్​ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కర్తార్​పుర్​ కారిడార్​ యాత్రపై పలు నిబంధనలు, షరతులు విధించింది.

కర్తార్​పుర్​లోని గురుద్వార్​ దర్బార్​ సాహిబ్​ను దర్శించుకునేందుకు రోజుకు 5000 మంది భక్తులను అనుమతించాలని భారత్​ ప్రతిపాదించింది. కానీ 700 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది పాక్​. వీరికి ప్రత్యేక అనుమతులు అవసరమని తెలిపింది. భక్తులకు ఉచిత వీసా సౌకర్యం కల్పించాలన్న భారత ప్రతిపాదనను పెడచెవిన పెడుతూ.. వీసా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

భారతీయులతో పాటు విదేశాల్లోని భారత సంతతికి చెందిన వారినీ ఈ యాత్రకు అనుమతించాలని భారత్​ కోరింది. కేవలం భారతీయులనే అనుమతిస్తామని పాక్​ స్పష్టం చేసింది. యాత్రకు వచ్చే బృందాల్లో 15 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.

యాత్ర ప్రత్యేక రోజున 10వేల మందికి అనుమతి, రవి నదిపై వంతెన నిర్మాణం, కాలినడక యాత్రికులకు అనుమతి వంటి భారత్​ ప్రతిపాదనలపై ఎలాంటి స్పందన తెలపలేదు పాక్​.

కర్తార్​పుర్​ కారిడాన్​ నిర్మాణానికి పాక్​ నుంచి సహకారం లేకపోయినప్పటికి పనులు వేగంగా సాగుతున్నాయి. గురునానక్​ దేవ్​ 550వ జన్మదినంలోగా ఈ ఏడాది నవంబర్​ 12 వరకు ఈ ప్రాజెక్ట్​ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి: 'చోక్సీ కోసం ఎయిర్​ అంబులెన్స్​ ఏర్పాటు చేస్తాం'

RESTRICTIONS: SNTV clients only. No access Argentina, MENA, USA and Canada. Subscribers in Brazil can distribute only up to two minutes per match and must observe a two hour delay in use from the end of the match. International broadcasters (such as the BBC or CNN) are subject to all restrictions and embargos when they broadcast national or regional feeds (including but not limited to feeds dedicated to Brazil, Argentina, the Middle Eastern & North Africa, the USA and Canada). They are not subject to the restrictions and embargos when they broadcast their global feed. Cleared for linear broadcast and stand alone digital use but cannot be used on a social media platform. The material must be geoblocked. No advertising or sponsorship may be placed around the highlights in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the event.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: CONMEBOL
DURATION:
STORYLINE:
Last Updated : Jun 23, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.