ETV Bharat / international

మహిళా ఖైదీని బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన లేడీ పోలీస్​ - ఇంటర్నేషనల్ న్యూస్ తెలుగు

పాకిస్థాన్​లో ఓ లేడీ పోలీస్ అధికారి(pakistan lady police) మహిళా ఖైదీతో అమానవీయంగా ప్రవర్తించింది. జైలులో అందరిముందు ఆమెతో బట్టలు విప్పించి నగ్నంగా నృత్యం చేయించింది. విషయం తెలిసిన పైఅధికారులు ఆ మహిళా పోలీస్​ను విధుల నుంచి తప్పించారు.

Pak lady police inspector forces woman detainee to dance naked; dismissed from service
దారుణం.. మహిళా ఖైదీతో నగ్న నృత్యం చేయించిన లేడీ పోలీస్​
author img

By

Published : Nov 13, 2021, 12:44 PM IST

Updated : Nov 13, 2021, 1:55 PM IST

పాకిస్థాన్​ బలూచిస్తాన్​ రాష్ట్రంలో ఓ మహిళా పోలీస్ అధికారి(pakistan lady police) విచక్షణా రహితంగా ప్రవర్తించింది. జైలులోని మహిళా ఖైదీని(Women prisoners) బలవంతంగా బట్టలు విప్పించింది. ఆ తర్వాత ఆమెను అందరిముందు నగ్నంగా నృత్యం చేయించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన దర్యాప్తు కమిటీ.. ఇన్​స్పెక్టర్​ శభానా ఇర్షద్​ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమానవీయంగా ప్రవర్తించినట్లు తేల్చింది. దీంతో ఆమెను విధుల నుంచి తొలగించారు పై అధికారులు.

క్వెట్టాలోని జిన్నా టౌన్​షిప్​లో ఓ చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను విచారణ నిమిత్తం శభానా అరెస్టు చేసింది. పోలీస్ రిమాండ్​లో ఉన్న ఆ మహిళను బట్టలు విప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత జైలులో అందరిముందు నగ్నంగా నృత్యం చేయించింది. విషయం తెలుసుకున్న పైఅధికారులు సదరు మహిళా పోలీస్​ అధికారిపై వేటు వేశారు. ఈ వికృత చేష్టలు రుజువు కావడం వల్ల ఆమె ఏమీ మాట్లడలేదని పేర్కొన్నారు.

మహిళా ఖైదీతో లేడీ పోలీస్ అధికారి(pakistan news) ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని క్వెట్టా డీఐజీ అజార్ అక్రమ్​ తెలిపారు. జైళ్లలో కూడా మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే మహిళా పోలీస్ అధికారులతోనే విచారణ జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిమాండ్​లో ఉన్న బాధిత మహిళను జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'పాకిస్థాన్​కు అమెరికా ఆయుధాలా? అంతా తూచ్​!'​

Last Updated : Nov 13, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.