పాకిస్థాన్లో మే 8 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ను విధించింది ప్రభుత్వం. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మే 8 నుంచి 15 వరకు ఈద్ సెలవులను ఇదివరకే ప్రకటించింది పాక్ ప్రభుత్వం.
పాక్లో మూడో వేవ్!
సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. దేశంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రధాని ప్రత్యేక సలహాదారు డాక్టర్. ఫైజల్ సుల్తాన్ తెలిపారు. కరోనా మూడో వేవ్.. పాక్లో ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే.. వైరస్ ఉద్ధృతి తగ్గుతుందన్నారు.
నేపాల్ ప్రధాని అత్యవసర సమావేశం
అత్యవసర కేబినెట్ సమావేశానికి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధికార నివాసంలో భేటీ అయ్యారు. కొవిడ్ సంక్షోభంపై చర్చించనున్నట్లు సమాచారం.
ఓలీ శర్మ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ ప్రభుత్వం పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయిన తర్వాత ఈ సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి : ఈయూ కౌన్సిల్ భేటీకి వర్చువల్గా మోదీ హాజరు