ఉగ్రవాద భావజాల ఇస్లామిస్టుల డిమాండ్లకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తలొగ్గారు. ఫ్రెంచ్ పత్రిక దైవదూషణ కార్టూన్లు వేసినందుకు.. ఆ దేశ రాయబారిని బహిష్కరించడం వల్ల ప్రయోజనం లేదని సోమవారం వ్యాఖ్యానించిన ఆయన మాట మార్చారు. ఇస్లామిస్టులు కోరినట్లే ఫ్రాన్స్ రాయబారిని బహిష్కరిస్తూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు.
తీవ్రవాద భావాలున్న 'ఇస్లామిస్ట్ పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్(టీఎల్పీ)' పై నమోదైన ఉగ్రవాద ఆరోపణల కేసులన్నింటినీ ఎత్తివేసేందుకూ ఇమ్రాన్ తలూపారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార పాకిస్థాన్ 'తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ సభ్యుడు అమ్జద్ అలీఖాన్ మంగళవారం హడావుడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నిజానికి ఇది ప్రైవేటు తీర్మానం. అయినా.. దీనిపై వెంటనే చర్చ చేపట్టేందుకు స్పీకర్ అసద్ ఖైసర్ అంగీకరించారు. గత ఏడాది సెప్టెంబరులో ఫ్రెంచ్ పత్రిక ఛార్లీహెబ్డో దైవదూషణతో కూడిన వ్యంగ్య చిత్రాలను ప్రచురించడాన్ని ఈ తీర్మానం ఖండించింది.
ఇదీ చదవండి: 'క్యూబా తీవ్రవాద పోషక దేశమే'
ఇదీ చదవండి: మన్మోహన్ కోలుకోవాలని పాక్ ప్రధాని ఆకాంక్ష