భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన దాయాది డ్రోన్‌ను సుఖోయ్ 30 ఎమ్.కే.ఐ కూల్చేసింది. రాజస్థాన్‌లోని బికనీర్ సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ఒకటి ఉదయం 11.30 గంటలకు భారత్‌లోకి ప్రవేశించటాన్ని వాయుసేన రాడార్లు పసిగట్టాయి. వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేశాయి.
భారత్‌లోకి అక్రమంగా డ్రోన్‌ను ప్రవేశపెట్టడం పాక్‌కు ఇది రెండోసారి. ఫిబ్రవరి 27న భారత్-పాక్ సరిహద్దు వద్ద గుజరాత్ కుచ్ జిల్లాలో ప్రవేశించబోయిన పాక్ డ్రోన్‌ను సైనికులు కూల్చేసారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాయుసేన అత్యంత అప్రమత్తంగా ఉంది.