ETV Bharat / international

హఫీజ్​ అధికార ప్రతినిధికి 15 ఏళ్ల జైలు శిక్ష - Hafiz Abdul Rehman Makki

ముంబయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి జమాత్​-ఉద్​-దవా అధినేత​ హఫీజ్​ అధికార ప్రతినిధి యాహ్యా ముజాహిద్​కు పాక్​ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చిన కేసులో ఈమేరకు తీర్పునిచ్చింది.

Pak court sentences JuD chief Hafiz Saeed's spokesman to 15 years in jail in terror financing case
ముంబయి ఉగ్రదాడి అనుచరుడికి 15 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Dec 3, 2020, 7:22 PM IST

ముంబయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారైన జమాత్​-ఉద్​-దవా అధినేత​ హఫీజ్ సయీద్​ ముఖ్య అధికార ప్రతినిధి యాహ్యా ముజాహిద్​కు పాకిస్థాన్​ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. మరో కేసుకు సంబంధించి ఇప్పటికే ముజాహిద్‌కు 32 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ముజాహిద్​తో పాటు జేయూడీ సీనియర్​ నాయకుడు జఫార్​ ఇక్బాల్​, హఫీజ్​ అబ్దుల్లా రెహమాన్​ మక్కి అనే ఇరువురికి ఆరు నెలలు శిక్ష విధించింది లాహోర్ న్యాయస్థానం.

అమెరికా ఆర్థిక విభాగం హఫీజ్​ సయీద్​ను అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా గుర్తించింది. ఇందుకు సంబంధించి 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసింది.

ఇదీ చూడండి: హఫీజ్​ సయీద్​పై నేరారోపణకు కాస్త ఆలస్యం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.