ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో.. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇద్దరు అనుచరులకు లాహోర్‌లోని ప్రత్యేక కోర్టు 15ఏళ్ల జైలుశిక్ష విధించింది. న్యాయమూర్తి అర్షద్ హుస్సేన్ భుట్టా.. యాహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్‌కు 15 ఏళ్ల చొప్పున జైలుశిక్ష ఖరారు చేశారు.
ఇంతకుముందు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన మూడు కేసుల్లో యాహ్యా ముజాహిద్‌కు న్యాయస్థానం 47ఏళ్లు, ఇక్బాల్‌కు 26ఏళ్ల జైలుశిక్ష పడింది.
ఇదే కోర్టు మంగళవారం నాడు సయీద్ బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కీకి 6నెలల జెలుశిక్ష ఖరారు చేసింది.
ఇదీ చూడండి:- హఫీజ్ సయీద్‌కు మరో భారీ షాక్