ETV Bharat / international

'పాక్​లో గుడి కూల్చివేత'లో పోలీసు కస్టడీకి 56 మంది - హిందూ దేవాలయంపై దాడి కేసు

పాకిస్థాన్​లో హిందూ దేవాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సహా మరో 55 మందిని 9 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది ఆ దేశ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం. ఈ ఘటనలో ఇప్పటి వరకు 350 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

temple vandalisation
పాక్​లో గుడి కూల్చివేత
author img

By

Published : Jan 10, 2021, 5:03 AM IST

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌కువాలోని హిందూ దేవాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సహా 55 మంది నిందితులను ఆ దేశ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం 9 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దాడికి సంబంధించి పోలీసులు వీరిని విచారించనున్నారు.

దశాబ్దాల నాటి ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గత వారం జమైత్ ఉలేమా-ఈ-ఇస్లామ్‌ పార్టీ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 350 మందిపై కేసు నమోదు చేశారు.

ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు.. దాడి వల్ల జరిగిన నష్టాన్ని దీనికి కారణమైన వారి నుంచి భర్తీ చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'పాక్​లో గుడి కూల్చివేత' ప్రధాన నిందితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.