పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాక్‌లోని ఓ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. 2017లో నమోదైన పరువు నష్టం దావా కేసులో ఆయన నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడు షహ్బాజ్ షరీఫ్ ఈ కేసు పెట్టారు.
పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌పై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ఈ మేరకు షహ్బాజ్ తనకు 61 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపిన షహ్బాజ్ కోర్టును ఆశ్రయించారు.
60 సార్లు వాదనలు..
ఈ కేసులో ఇప్పటికే కోర్టు 60 సార్లు వాదనలు వినగా.. 33 సార్లు ఇమ్రాన్ వాయిదా కోరారు. మరికొన్ని సందర్భాల్లో తన లాయర్ల ద్వారా కోర్టుకు వాదనలు వినిపించిన పాక్ ప్రధాని.. ఇప్పటివరకు స్వయంగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వలేదు. ఫలితంగా ఈసారి తప్పకుండా కోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ సారి ఇక అంతే.?
ఇమ్రాన్‌ఖాన్ సమాధానమివ్వని పక్షంలో అధికరణ 62, 63 ప్రకారం ప్రధాని పదవికి అనర్హులవుతారని పీఎంఎల్-ఎన్ పార్టీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అప్పుడే అయిపోలేదు.. ఉగ్రరూపం ఇప్పుడే మొదలైంది'