బాబ్రీ కేసులో 32మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ భారత్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాకిస్థాన్ ఖండించింది. బాబ్రీ మసీదు ఘటనకు సంబంధం ఉన్న అందరినీ నిర్దోషులుగా తేల్చడాన్ని పాక్ విదేశాంగశాఖ కార్యాలయం తప్పుబట్టింది.
"దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా మందిరాలకు భద్రత కల్పించాలని భారత ప్రభుత్వానికి పాక్ అభ్యర్థిస్తోంది. బాబ్రీ కేసులో అందరినీ నిర్దోషులుగా తేల్చడం సిగ్గుచేటు."
--- పాకిస్థాన్ విదేశాంగశాఖ.
అయితే గతంలో అనేక మార్లు భారత అంతర్గత విషయాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంది. ఆయా సందర్భాల్లో పాక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది భారత్.
మీడియా కథనాలు...
మరోవైపు బాబ్రీ కేసు తీర్పునకు పాకిస్థాన్ మీడియా అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చింది. డాన్, జియో, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, జంగ్లు విస్తృతంగా కథనాలు ప్రచురించాయి. తీర్పును వివాదాస్పదమని అభివర్ణించాయి.
ఇదీ చూడండి:- బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు