ETV Bharat / international

విదేశాల్లో పాకిస్థాన్ నల్లధనం - హమ్మద్ అజార్

పాక్ దేశీయులు 1, 52, 500 విదేశీ బ్యాంకు ఖాతాల్ని కలిగి ఉన్నారని పాకిస్థాన్ రెవెన్యూ శాఖ సహాయమంత్రి హమ్మద్ అజార్ వెల్లడించారు. ఈ ఖాతాల్లో పాక్​కు చెందిన 11 బిలియన్ డాలర్ల కరెన్సీ డిపాజిటై ఉందని స్పష్టం చేశారు అజార్.

విదేశాల్లో పాక్ నల్లధనం
author img

By

Published : Mar 19, 2019, 7:09 PM IST

Updated : Mar 19, 2019, 9:06 PM IST

పాకిస్థాన్ దేశంలోని డబ్బంతా విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లుగా మారుస్తున్నారు అక్కడి వ్యాపారులు. 1,52,500 విదేశీ బ్యాంకు ఖాతాల్ని పాక్​ పౌరులు కలిగి ఉన్నారని ప్రకటించారు పాక్ రెవెన్యూ శాఖ సహాయమంత్రి హమ్మద్ అజార్. వీటిలో 11 బిలియన్ అమెరికన్​ డాలర్లు డిపాజిటై ఉన్నట్లు వెల్లడించారు.

ఈ విదేశీ ఖాతాల్లోని నగదులో సగం వరకూ పన్ను చెల్లించని నల్లధనం ఉన్నట్లు అజార్ పేర్కొన్నారు. అక్రమ వ్యాపారాలు చేసేవారు నగదును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ఖాతాలపై 'ఫెడరల్ బోర్డ్​ ఆఫ్ రెవెన్యూ' నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. పాక్​ దేశీయులు తమ బ్యాంకు ఖాతాల వివరాల్ని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఒకెడ్​)తో పంచుకున్నట్లు ప్రస్తావించారు.

జాతీయ రిజిస్ట్రేషన్ ప్రాధికార సంస్థ, పాక్ దర్యాప్తు సంస్థ, పాక్ కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ' వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఈ ఖాతాలు వెలికితీసినట్లు ఆయన స్పష్టం చేశారు. పన్ను ఎగవేతదారుల వివరాల్ని వెలికి తీసే పనిలో సగం వరకు విజయం సాధించామన్నారు.

చర్యలు చేపట్టలేం...

పన్ను ఎగవేతదారుల నుంచి బకాయిల్ని రాబట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోవట్లేదని ప్రకటించారు ఫెడరల్ బ్యాంకు ఛైర్మన్ జహాన్​జేబ్​ ఖాన్. తమకున్న సమచారం ఆధారంగా పన్ను ఎగవేతదారులపై దాడులు చేపట్టలేమని వెల్లడించారు.

ఇదీ చూడండి:"నిలువరించే సత్తా మన​కుంది"

New Delhi, Mar 19 (ANI): Member of Parliament of Aam Aadmi Party (AAP) Sanjay Singh expressed his views on AAP-Congress alliance. He said, "I even said earlier that Congress is in really confused state. They are living in an illusion and you cannot fight with others in such situation. You have to come out from illusion state to make a clear decision about the country." Singh also said, "Don't give chance to BJP."

Last Updated : Mar 19, 2019, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.