ఒకవైపు ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఆదే విపక్షాలతో పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా - ఐఎస్ఐ అధిపతి ఫయీజ్ హమీద్ రహస్యంగా సమావేశమైనట్లు వస్తున్న వార్తలు పాకిస్థాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ నెల 16న బాజ్వా-హమీద్‌లు రహస్యంగా 15మంది ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించినట్లుగా పాక్ మీడియా పేర్కొంది. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్‌తో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సైతం పాల్గొన్నారు.
ఈ సమావేశం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించినట్లు పాక్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
అయితే, పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ మాత్రం ఈ సమావేశం భారత్ వ్యతిరేకిస్తున్న గిల్గిత్-బాల్టిస్థాన్ గురించి జరిగిన వ్యూహత్మక చర్చలు మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలు ఇతర అంశాలతో పాటు.. పాక్ రాజకీయాల్లో క్రమంగా పెరుగుతున్న సైన్యం పాత్రపై చర్చినట్లు తెలుస్తోంంది. అదే సమయంలో పాకిస్థాన్ పాలకుల జవాబుదారీతనంపై పలు అంశాలు లేవనెత్తారు.
పాకిస్థాన్‌లో సైన్యం వ్యవహారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. దేశంలో ప్రభుత్వంపైన మరో ప్రభుత్వం పని చేస్తుందని పాక్ సైన్యాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: జిన్‌పింగ్‌ను విమర్శించిన నేతకు 18 ఏళ్ల జైలు
సోమవారం సైన్యాధిపతి జనరల్ బాజ్వా.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కార్యలయంలో కలిశారు. అయితే ఈ రహస్య సమావేశానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని సమాచారం.