ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో.. జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీద్ సయీద్ ఐదుగురు అనుచరులకు లాహోర్‌లోని ప్రత్యేక కోర్టు 9 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఉమర్ బహదర్, నసరుల్లా, సమి ఉల్లాకు మొదటిసారి శిక్ష పడింది. మరో ఇద్దరు నిందితులు యాహ్యా ముజాహిద్, జఫర్ ఇక్బాల్‌ను గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన విషయంలో దోషులుగా తేల్చింది కోర్టు.
న్యాయమూర్తి ఇజాజ్ అహ్మద్ భుట్టర్ ఈ కేసుపై తీర్పు వెలువరించారు. ఇదే కేసుకు సంబంధించి సయీద్ బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కీకి 6 నెలల జెలుశిక్ష ఖరారు చేశారు.