ETV Bharat / international

వైమానిక దాడుల్లో 30మంది తాలిబన్లు హతం - ఉగ్రవాదులు

తాలిబన్ల స్థావరాలపై అఫ్గానిస్థాన్​ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. దాడుల్లో ఐదు వాహనాలు, రెండు బంకర్లు, ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం తెలిపింది.

Taliban terrorists killed
తాలిబన్లు హతం
author img

By

Published : Jul 24, 2021, 2:22 PM IST

అఫ్గానిస్థాన్​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. తాలిబన్లకు చెందిన ఐదు వాహనాలు, రెండు బంకర్లు, ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం తెలిపింది.

హెల్మాండ్​ రాష్ట్రం.. లష్కర్​ ఘా ప్రాంతంలోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 14 మంది ముష్కరులు, మరో ఇద్దరు ఇతర దేశానికి చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

బలగాల ఉపసంహరణతో..

మే 1న అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. దేశంలోని ప్రధాన భూభాగాలను ఆక్రమిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్​లోని 419 జిల్లాలు తాలిబన్ల అధీనంలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.