ETV Bharat / international

'షరీఫ్​తో బిన్ లాడెన్ ఆర్థిక పొత్తు' - అబిదా హుస్సేన్ సంచలన ఆరోపణలు

పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​కు అల్​-ఖైదా నాయకుడు ఒసామా బిన్​ లాడెన్​ ఆర్థికంగా సహాయం చేశారని ఆరోపించారు ఆ దేశ మాజీ రాయబారి అబిదా హుస్సేన్​. గతంలో షరీఫ్​కు లాడెన్ మద్దతుగా ఉన్నారని వెల్లడించారు.

Osama bin Laden supported, funded Nawaz Sharif: Ex-Pak envoy
'నవాజ్​ షరీఫ్​కు లాడెన్​తో ఆర్థిక సంబంధాలున్నాయి'
author img

By

Published : Jan 31, 2021, 10:28 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​పై ఆ దేశ​ మాజీ రాయబారి అబిదా హుస్సేన్​ సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్​​తో అల్​-ఖైదా నాయకుడు ఒసామా బిన్​లాడెన్​కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

"ఒకానొక సమయంలో షరీఫ్​కు బిన్ లాడెన్​ మద్దతు తెలిపాడు. షరీఫ్​కు ​ఆర్థికంగా సహాయం చేసేవాడు. ఇది చాలా పెద్ద కథ."

-అబిదా హుస్సేన్, పాకిస్థాన్​ మాజీ రాయబారి

ఈ నేపథ్యంలో లాడెన్​పైనా కీలక వ్యాఖ్యలు చేశారు హుస్సేన్​. లాడెన్​ ఒకప్పుడు అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడని.. అమెరికన్లు సైతం ఆయన్ను మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ కొంత కాలం తరువాత అందరు అతన్ని అపరిచితుడిగా భావించారన్నారు.

అబిదా.. షరీఫ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు.

10 మిలియన్ డాలర్లు

విదేశాల నుంచి నిధులు సేకరించే సంప్రదాయానికి పునాది వేసింది నవాజ్ షరీఫేనని 'తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్' పార్టీ ఎంపీ ఫరూఖ్ హబీబ్ ఆరోపణలు చేసిన కొద్దిరోజులకే అబిదా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెనజీర్​ భుట్టో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు లాడెన్​ నుంచి షరీఫ్ 10 మిలియన్ డాలర్లు తీసుకున్నారని హబీబ్ ఆరోపించారు.

వరుసగా మూడుసార్లు పాక్​ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన షరీఫ్​.. కశ్మీర్​లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు లాడెన్​ నుంచి డబ్బులు తీసుకున్నట్లు గతంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి: నవాజ్​ షరీఫ్​ను నేరస్థుడిగా ప్రకటించిన పాక్​ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.