ETV Bharat / international

'89 దేశాల్లో ఒమిక్రాన్.. అలాంటి చర్యలతోనే అడ్డుకట్ట'

WHO On Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్​ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​-19 నిబంధనలు​, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. 89 దేశాల్లో ఈ వేరియంట్​ విస్తరించిందని పేర్కొంది.

WHO On Omicron
ఒమిక్రాన్ వేరియంట్
author img

By

Published : Dec 18, 2021, 6:41 PM IST

Updated : Dec 18, 2021, 8:54 PM IST

WHO On Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా ఈశాన్య ఆసియాలోని ఏడు దేశాల్లో ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ కీలక సూచనలు చేసింది. కొవిడ్​-19 నిబంధనలు​, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటిచడం వంటి చర్యలతోనే ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టవచ్చని డబ్ల్యూహెచ్​ఓ ఈశాన్య ఆసియా డైరెక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. రిస్క్ ఎక్కువగా ఉన్నవారిని కాపాడాలన్నారు.

" డెల్టా వేరియంట్​ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైనది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్​పై పూర్తి సమాచారం లేదు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్​పై పూర్తి వివరాలు వెల్లడవుతాయి. అయితే ఒమిక్రాన్​ను తక్కువ అంచనా వేయవద్దు. వ్యక్తిగత సంరక్షణతోపాటు ఒకరినొకరు సంరక్షించుకోవాలి. కొవిడ్ వాక్సిన్​లు వేయించుకోవాలి, మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి."

-- పూనమ్​ ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్​ఓ ఈశాన్య ఆసియా డైరెక్టర్​

అన్నివిభాగాల్లో వైద్యం, ఐసీయూ బెడ్ల సామర్థ్యం, ఆక్సిజన్ సరఫరా.. తదితర విభాగాలను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని పూనమ్ సూచించారు. మహమ్మారిని అంతమొందించాలంటే వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. అయితే కేవలం టీకా కార్యక్రమంతోనే కాకుండా ప్రజారోగ్యం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటిస్తే.. కొవిడ్​-19 వ్యాప్తితో పాటు మరణాలు రేటును కూడా తగ్గించవచ్చన్నారు.

89 దేశాల్లో ఒమిక్రాన్​..

Omicron Cases In World: ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 89 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కన్నా.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. 1.5 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నట్లు పేర్కొంది.

అయితే ఈ వేరియంట్​.. రోగ నిరోధకశక్తిపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించి సమాచారం తక్కువగా ఉందని తెలిపింది డబ్ల్యూహెచ్​ఓ.

ఇదీ చూడండి: 'ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'

Last Updated : Dec 18, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.