ETV Bharat / international

'భారత్​ నుంచి ఆ ప్రాంతాలను తిరిగి తీసుకుంటాం' - కాలాపానీ వివాదం

వివాదాస్పద భూభాగాలను కలుపుతూ నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేసిన క్రమంలో భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే.. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్న తరుణంలో మానుతున్న పుండుపై కారం చల్లారు నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి. భారత్​ నుంచి కాలాపానీ, లింపుయధుర, లిపులేఖ్​ భూభాగాలను తిరిగి తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

KP Sharma Oli
నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి
author img

By

Published : Jan 11, 2021, 5:52 AM IST

భారత్​-నేపాల్​ మధ్య కొద్ది నెలలుగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ నుంచి కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్​ భూభాగాలను తిరిగి తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

జాతీయ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఓలి. ఆ దేశ విదేశాంగ మంత్రి జనవరి 14న భారత్​కురానున్న తరుణంలో ఓలి ఈ మేరకు వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరువాత సీనియర్​ నేతలు భారత్​లో పర్యటించటం ఇదే తొలిసారి.

" మహాకాళి నదికి తూర్పున ఉన్న కాలాపాని, లింపుయధుర, లిపులేఖ్ ప్రాంతాలు సుగౌలి ఒప్పందం ప్రకారం నేపాల్​కు చెందినవి. భారత్​తో దౌత్యపరమైన చర్చల ద్వారా వాటిని తిరిగి పొందుతాం. జనవరి 14న మా విదేశాంగ మంత్రి భారతలో పర్యటించనున్నారు. ఈ మూడు కీలక ప్రాంతాలను చేర్చుతూ విడుదల చేసిన కొత్త మ్యాప్​పైనే ప్రధానంగా చర్చించనున్నారు. "

- కేపీ శర్మ ఓలి, నేపాల్​ ప్రధానమంత్రి.

భారత్​కు చెందిన మూడు కీలక ప్రాంతాలను కలుపుతూ గత ఏడాది కొత్త మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​. ఆ వెనువెంటనే పార్లమెంట్​ కూడా ఆమోద ముద్రవేసింది. దీనిపై స్పందించిన భారత్​.. నేపాల్​ చర్యను ఖండించింది. అది ఏకపక్ష చర్యగా పేర్కొంది. కృత్రిమ విస్తరణ ఆమోద యోగ్యం కాదని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను నేపాల్​ ఉల్లంఘిస్తోందని తెలిపింది.

ఇదీ చూడండి:భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.