నిర్లక్ష్యపూరితమైన వైఖరితో తైవాన్‌కు మద్దతుగా నిలిచి చైనాతో సైనికపరమైన ఉద్రిక్తతలకు అమెరికా(china us news) తెరలేపిందని మండిపడింది ఉత్తర కొరియా (Taiwan china news). ఆ ప్రాంతంలో అమెరికా మిలిటరీ ఉనికి పెరుగుతుండటం వల్ల ముప్పు ఏర్పడతుందని ఆరోపించింది (north korea china relations).
తైవాన్‌కు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సైనిక శిక్షణను అందిస్తున్న అగ్రరాజ్యంపై ఉత్తర కొరియా విదేశాంగశాఖ ఉపమంత్రి పాక్ మయాంగ్ హో విమర్శలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా విచక్షణారహితంగా జోక్యం చేసుకుంటోందని, కానీ అది చైనా అంతర్గత వ్యవహారంగా ఉత్తర కొరియా భావిస్తోందని అన్నారు. ఇదే కొనసాగితే సున్నితమైన కొరియన్ ద్వీపకల్పం సమస్యలోనూ అమెరికా జోక్యం చేసుకునే ప్రమాదం ఉన్నట్టు తాము భావిస్తున్నామని తెలిపారు. చైనా నుంచి తైవాన్‌కు ఎప్పుడైనా ముప్పు ఎదురైతే, అమెరికా తక్షణమే సాయం చేస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో పాక్ మయాంగ్ ఈ ప్రకటన చేశారు.
చైనా- ఉత్తర కొరియా మధ్య సుదీర్ఘ స్నేహబంధం ఉంది. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా భద్రతాపరమైన వ్యూహాలు చేపట్టడంపై ఉత్తరకొరియా నిరసన తెలుపుతోంది (us taiwan china).
చైనా మాటలివి..
డాక్టర్ సన్‌యెట్ సేన్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమం చైనాలో రాజరిక పాలనను అంతమొందించి 110 ఏళ్లు నిండిన సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఇటీవలే ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు(taiwan china conflict). తమ ప్రధాన భూభాగంలో తైవాన్ అంతర్భాగమేనని ఉద్ఘాటించారు. ద్వీప దేశ స్వతంత్రతకు మద్దతు తెలిపే శక్తులకు మంచి ముగింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు.
అమెరికా స్పందన..
ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను (Taiwan China news) తాము రక్షిస్తామని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్(biden taiwan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్ ఉందని వెల్లడించారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో భాగంగా బైడెన్ (Biden news) ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని' ఆయన పేర్కొన్నారు.
తైవాన్ ఇలా..
చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తైవాన్(Taiwan China News) తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు(Taiwan China Conflict) పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది
ఇదీ చూడండి:-