ETV Bharat / international

ఐరాస నిబంధనలు పాటించని కిమ్​.. అక్రమంగా ఇసుక రవాణా!

ఆయన ఓ దేశానికి నియంత. ఆయన మాటే శాసనం. ఆయన మరెవరో కాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్. కిమ్​ ఎవరి అంచనాలకు అందరు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కిమ్​ సంగతి తెలిసి ఉత్తర కొరియాపై ఐరాస చాలా ఆంక్షలు విధించింది. తాజాగా​ ఐరాస ఆంక్షలకు విరుద్ధంగా ఉత్తర కొరియా భారీ ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అమెరికాకు చెందిన నిఘా వర్గాలు కనుగొన్నాయి.

North Korea president selling sand in the ways of illegally
ఆ దేశ అధ్యక్షుడే అక్రమ ఇసుక వ్యాపారి!
author img

By

Published : Jun 10, 2020, 4:57 PM IST

కిమ్‌ జోంగ్‌ఉన్‌.. ఈ పేరు గుర్తుకు రాగానే అణ్వాయుధాలు.. క్షిపణి పరీక్షలు.. క్రూరమైన శిక్షలు.. గుర్తుకొస్తాయి.. కానీ, కిమ్‌ ఎవరి అంచనాలకు అందరు. ఆయన సంగతి తెలిసే ఐరాస ఆంక్షలు విధించి నియంత్రిస్తోంది. వీటికి భయపడితే ఉత్తరకొరియా అధినేత ఎలా అవుతారు..! అందుకే, స్మగ్లింగ్‌ను కూడా చేయిస్తుంటారు. ఉత్తరకొరియా నుంచి బొగ్గు ఎక్కువగా అక్రమ రవాణా అవుతుంటుంది. ఇటీవల కాలంలో కిమ్‌ భారీ ఎత్తున ఇసుకను కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు తేలింది. ఇటువంటివి ఎగుమతి చేయడం కూడా ఐరాస ఆంక్షలకు పూర్తిగా వ్యతిరేకం.

బయట పడింది ఇలా..

అమెరికాలోని వాషింగ్టన్‌లో సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అనే సంస్థ ఉంది. ఇది బిగ్‌డేటా సాయంతో భద్రతకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అమెరికా భద్రత అంటే ఉత్తర కొరియాపై కన్నేయటమేగా. ఇద్దరు విశ్లేషకులు ఆ పనిలో ఉండగా.. వారికి ఉ.కొరియాలోని హైజు అనే తీరప్రాంత పట్టణం వద్ద వందల కొద్దీ నౌకలు కనిపించాయి. దాదాపు 279 నౌకలను గుర్తించారు. డ్రగ్స్‌, ఆయుధాలు ఏమైనా తరలిస్తున్నారేమోననే అనుమానంతో మరింత దృష్టిపెట్టారు. చాలా నౌకలపై చైనా పతాకాలు ఉన్నాయి.. మరికొన్నిటిపై చైనా పేర్లు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించగా.. అవన్ని అక్కడ డ్రెడ్జింగ్‌ చేస్తున్నట్లు తేల్చారు. అప్పుడు వారికి కిమ్‌ చేస్తున్న వ్యాపారంపై ఓ స్పష్టత వచ్చింది. అక్కడి నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

2017లో ఉత్తరకొరియాపై ఐరాస విధించిన ఆంక్షల ప్రకారం భూమిపై ఖనిజాలు.. రాళ్లను ఎగుమతి చేయడంపై కూడా నిషేధమే. ఇటీవల ఏప్రిల్‌లో ఐరాస విడుదల చేసిన నివేదికలో కూడా ఉ.కొరియా ఇసుక వ్యాపారం ద్వారా 22 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. మే 2019 ఇప్పటి వరకు దాదాపు 10లక్షల టన్నుల ఇసుకను పొరుగు దేశాలకు తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఉత్తరకొరియా ఇసుకను అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తోంది. గతంలో ఇక్కడి నుంచి దక్షిణ కొరియా కూడా ఇసుకను కొనుగోలు చేసింది. 2008 తర్వాత కొనుగోళ్లు నిలిపివేసింది.

ఇసుక ప్రాముఖ్యం..

గాజుపరిశ్రమ, ఎలక్ట్రానిక్స్‌ తయారీలో సిలికా ఇసుకకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో ఏటా దాదాపు 50 బిలియన్‌ టన్నుల ఇసుకను వినియోగిస్తారని ఓ అంచనా. చాలా దేశాల్లో పర్యావరణ కారణాలతో ఇసుక తవ్వకాలపై ఆంక్షలున్నాయి. అదే ఉత్తరకొరియాలో కిమ్‌ కుటుంబం ఎంత చెబితే అంత. అక్కడ పర్యావరణ ఆంక్షలు వంటివి ఎవరికీ పట్టవు.

అనుకుంటే ఏదైనా తెప్పించగలరు..

ఉత్తర కొరియాపై ఆంక్షలు ఉండటంతో ఆ దేశంతో వ్యాపారం చేయడానికి ఏ దేశము ముందుకు రాదు. దీంతో ఆదాయ వనరుల కోసం పలు దేశాలకు ఉ.కొరియా ఉత్పత్తులను అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో అక్రమ రిజిస్ట్రేషన్లతో ఉన్న నౌకలను వినియోగిస్తుంటారు. గతంలో ఇలానే కిమ్‌ తనకు ఇష్టమైన బెంజ్‌కార్లను నెదర్లాండ్స్‌ నుంచి తెప్పించారు. ఆ తర్వాత కిమ్‌ తెప్పించిన విధానం తెలిసి నిఘా సంస్థలు కళ్లు తేలేశాయి. పలు నౌకలు మారుస్తూ.. చైనాకు చేర్చి.. అక్కడి నుంచి రష్యాకు పంపించారు. రష్యా నుంచి ప్రత్యేక విమానాల్లో ఉ.కొరియాకు చేర్చారు. ఉత్తరకొరియాకు కార్లను సరఫరా చేయడంలో జపాన్‌, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌ వంటి అమెరికా మిత్రదేశాల భూభాగాన్ని కూడా వాడుకోవడం విశేషం. 2015-17 మధ్యలో కిమ్‌ బృందం 90 దేశాల నుంచి విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకొన్నట్లు అంచనా. ఇలాంటి మార్గాల్లోనే ఉ.కొరియా అణు టెక్నాలజీ, ఇంధనాలను తెప్పిస్తున్నట్లు అమెరికా అనుమానిస్తోంది.

ఇదీ చూడండి: కీలక డిమాండ్​తో సత్య నాదెళ్లకు ఉద్యోగుల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.