North Korea missile test: ఉత్తర కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి పరీక్ష విఫలమైందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అన్నారు. గత బుధవారం ఉత్తర కొరియా రాజధాని నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు క్షిపణి ప్రయోగం జరిగిందని ఆయన ఓ నివేదికలో తెలిపారు.
క్షిపణి ప్రయోగం గురించి అమెరికా, దక్షిణ కొరియా నిఘా వర్గాలు వివరాలు వెల్లడిస్తాయని నివేదికలో ఉన్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. 2017 నుంచి ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేస్తుందని అనుమానాలున్న నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగిందని తెలుస్తోంది.
గత వారంలో ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణి పరీక్షలు జరిపిందని అమెరికా, దక్షిణ కొరియాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రయోగించిన క్షిపణి 2020లో ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్‌లో మొదటిసారి ప్రదర్శించిన హాసంగ్-17 అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇదీ చూడండి: