ETV Bharat / international

'అప్పటి వరకు తక్కువ తినండి'- ప్రజలకు కిమ్​ పిలుపు!

తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉత్తర కొరియా(North Korea Food Crisis) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశ ప్రజలను 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.

North Korea Food Crisis
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం
author img

By

Published : Oct 28, 2021, 9:33 PM IST

ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరతతో(North Korea Food Crisis) అల్లాడుతోంది. కఠినమైన కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానుల కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim jong-un) పిలుపునిచ్చినట్లు సమాచారం. ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం విఫలమైనందునే ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం! మే నెలలోనే దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. ఈ ఏడాది దాదాపు పది లక్షల టన్నుల ఆహార కొరత రావచ్చని అంచనా వేసింది. ఐరాస సైతం దేశంలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే.. ఉత్తర కొరియా దాన్ని కొట్టిపారేసింది.

చైనాతో సరిహద్దు మూసివేత మొదలు..

కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర కొరియా 2020లో చైనాతో ఉన్న సరిహద్దును మూసివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. మరోవైపు అణ్వాయుధాల కార్యకలాపాలకు వ్యతిరేకంగా పలు దేశాలు ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశం ఒంటరిగా మారింది. దీంతోపాటు స్థానికంగా తుపాన్లు, వరదలు పంటలను నాశనం చేశాయి. ఫలితంగా ఆహార కొరత మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడం వల్ల.. స్థానికంగా నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఈ ఫుడ్ ఎమర్జెన్సీ 2025 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటివరకు ఉత్తర కొరియా, చైనా మధ్య వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడ చాలా తక్కువని చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి అధ్వానంగా మారిందని, రాబోయే చలికాలంలో బతికి ఉంటామో లేదోనంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

ఇవీ చూడండి:

పెయింటర్లపై మహిళ క్రూరత్వం- 26 అంతస్తుల ఎత్తులో ఉండగా తాడును కోసేసి..

ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌- ప్రపంచ నేతలకు వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.