ETV Bharat / international

మారని ఉత్తరకొరియా.. మరోసారి క్షిపణి పరీక్షలు! - North Korea fires multiple cruise missiles

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ... ఉత్తర కొరియా మాత్రం క్షిపణి ప్రయోగాల్లో తలమునకలై ఉంది. ఇవాళ ఉదయం స్వల్ప శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఆ దేశం ప్రయోగించినట్లు దక్షిణ కొరియా భద్రతా దళాలు గుర్తించాయి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్​ ఇల్ సుంగ్ 108వ జయంతికి ఒక్క రోజు ముందు... ఆ దేశ సైన్యం క్షిపణి ప్రయోగాలు చేయడం గమనార్హం.

North Korea fires multiple suspected cruise missiles: Seoul
క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
author img

By

Published : Apr 14, 2020, 3:42 PM IST

ఉత్తర కొరియా ఇవాళ సముద్రం వైపు పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా భద్రతా దళాలు చెబుతున్నాయి. ముంచోన్​ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు​... 'స్వల్ప శ్రేణి క్రూయిజ్​ మిస్సైల్స్' అయ్యుండొచ్చని జాయింట్స్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్​ అభిప్రాయపడింది.

తాత జయంతి సందర్భంగా...!

ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ తాత అయిన కిమ్​ ఇల్​ సుంగ్​ 108వ జయంతి బుధవారం. మరోవైపు ఉత్తర కొరియా.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి. వీటికి ఒక్క రోజు ముందు ఈ అణు సంపన్న దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

తరచుగా ప్రయోగాలు...

ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఇటీవలి కాలంలో తరచుగా బాలిస్టిక్​ క్షిపణులను పరీక్షిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించే ముందు తమ క్షిపణులను భూమ్యాకర్షణకు అందని రీతిలో గగనతలంలోకి ప్రయోగిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

కిమ్​ రాజ్యాన్ని తాకని కరోనా...

ప్రపంచాన్నంతా తన కబంద హస్తాలతో నలిపేస్తున్న కరోనా మహమ్మారి... ఉత్తర కొరియా వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి: కరోనా 'విభేదాల'పై ట్రంప్​-ఫౌచి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.