ETV Bharat / international

'కరోనా పేరుతో ఉత్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘన' - UN latest meetings

కరోనా వైరస్​ పేరుతో ఉత్తర కొరియా.. తమ దేశ ప్రజల మానవహక్కులను మరింత కాలరాస్తోందని పాశ్చాత్య దేశాలు విమర్శించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రహస్య భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాయి.

North Korea accused of using virus to crack down on rights
'కరోనా పేరుతో ఉత్తరకొరియా మానవహక్కులను హరిస్తోంది'
author img

By

Published : Dec 12, 2020, 9:50 AM IST

కరోనా పేరుతో ఉత్తర కొరియా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించాయి ఎనిమిది పాశ్చాత్య దేశాలు. సొంత ప్రజలపై అనుచిత వైఖరి ప్రదర్శిస్తూ.. వారి హక్కులను కిమ్​ జోంగ్​ ఉన్​ ప్రభుత్వం కాలరాస్తోందని పేర్కొన్నాయి. వర్చువల్​గా జరిగిన యూఎన్​ భద్రతా మండలి రహస్య సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాయి.

కౌన్సిల్​ సభ్యులైన జర్మనీ, బెల్జియం, డొమినిక్​ రిపబ్లికన్​, ఎస్టోనియా, ఫ్రాన్స్​, యునైటెడ్​ కింగ్​డమ్​, అమెరికా దేశాలతో పాటు జపాన్​ ఈ ప్రకటనను విడుదల చేశాయి. తమ ప్రజలపై అణ్వాయుధ శక్తి, సైనిక బలాన్ని ఉత్తర కొరియా రుద్దుతోందని వెల్లడించాయి.

బహిర్గత సమావేశం నిర్వహించాలని జర్మనీ కోరగా.. ఉత్తర కొరియా పొరుగుదేశాలైన రష్యా, జర్మనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఉత్తరకొరియా.. తన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా సరిహద్దులను మూసివేసింది. ఫలితంగా.. తమ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. కానీ ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా సహా పలు దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: 'ఒప్పందాలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.