ఉత్తర చైనా హెబీ రాష్ట్రంలోని ఓ గనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
కాలం చెల్లిన పదార్థాల వల్లే గనిలో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థరించారు అధికారులు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
జనవరిలో చైనాలోని షాండాంగ్ బంగారు గనిలో పేలుడు సంభవించి 10 మంది కార్మికులు మరణించారు.
ఇదీ చదవండి : ఎడారి దేశంలో నీలి రంగు రహదారి