ETV Bharat / international

'చిన్న కూటములు ప్రపంచానికి ప్రమాదకరం' - జావో లిజియాన్, చైనా విదేశాంగ ప్రతినిధి

సిద్ధాంతాల పేరుతో చిన్న కూటములను ఏర్పాటు చేసుకోవటం ప్రపంచానికి ప్రమాదకరమని 'క్వాడ్'ను​ ఉద్దేశించి విమర్శలు చేసింది చైనా. 'చైనాతో ముప్పు' అని చెడు ప్రచారం చేస్తూ సరిహద్దు దేశాలతో తమకు విభేధాలు సృష్టించేందుకు క్వాడ్​ దేశాలు యత్నిస్తున్నాయని మండిపడింది.

No 'small cliques' should be formed: China on first Quad summit
'చిన్నకూటములు ప్రపంచానికి ప్రమాదకరం'
author img

By

Published : Mar 16, 2021, 6:23 AM IST

చైనా పట్ల క్వాడ్​ కూటమి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చైనా మండిపడింది. సిద్ధాంతాల పేరుతో ఆయా దేశాలు చిన్న కూటములను ఏర్పాటు చేసుకోవటం ప్రపంచానికి ప్రమాదకరమని ధ్వజమెత్తింది. తమ సరిహద్దు దేశాలకు తప్పుడు సందేశాన్ని అందిస్తూ.. తమపై విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడింది. ఆయా దేశాలు తమతో ఉన్న సిద్ధాంత పక్షపాతాలు, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడితే ప్రాంతీయ దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్​ స్పష్టం చేశారు.

"'చైనాతో ముప్పు' అనే అంశంతో కొన్ని దేశాలు మా దేశంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా చేసి ప్రాంతీయ దేశాల్లో తమపై విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి చర్యలను స్వాగతించం. ఇవి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తాయి. దేశాల మధ్య పరస్పర భాగస్వామ్యం, నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యం."

-జావో లిజియాన్, చైనా విదేశాంగ ప్రతినిధి

'అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దు'

డ్రాగన్​ను ఎదుర్కొనేందుకు అమెరికా మిత్ర దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలన్న ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు జావో. చైనా-అమెరికా సంబంధాలను.. అమెరికా మంచి మనస్తత్వంతో చూడాలన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం ఆపేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన, పటుత్వమైన అభివృద్ధి కోసం ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు.

ఈ నెల 12న క్వాడ్ మొదటి సమావేశం జరిగింది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో కూటమి దేశాల (అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్​) అధినేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం కోసం కూటమి దేశాలతో కలిసిపని చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండి : 'చైనా సరిహద్దులో 59 రహదారుల అనుసంధానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.