అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు(taliban afghanistan news) మొదటి నుంచే మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించటం ప్రారంభించారు. 20 ఏళ్ల కిందట అధికారంలో ఉన్నప్పటి మాదిరిగానే.. వారి హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా.. తాత్కాలిక ప్రభుత్వాన్ని(taliban government) ఏర్పాటు చేసిన తాలిబన్లు షరియా చట్టాలకు అనుగుణంగానే తమ పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. అందుకు తగినట్లుగానే మహిళలపై(women in afghanistan) అనేక ఆంక్షలు విధిస్తున్నారు.
ఆటలు బంద్...
తాజాగా అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు తాలిబన్లు. వారు(women rights in afghanistan) ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల ఎక్స్పోజింగ్ అవుతుందని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిఖ్ తెలిపారు.
"మహిళలకు ఆటలు ముఖ్యమని అనుకోవట్లేదు. క్రికెట్, ఇంకే ఆటైనా సరే అమ్మాయిలు ఆడాల్సిన అవసరం లేదు. క్రీడల్లో మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉండదు. అక్కడ ఆడేవారి ముఖం, శరీరం కవర్ చేసుకోలేరు. ఇక ఇప్పుడున్న మీడియా ద్వారా ప్రపంచమంతా వారి ఫొటోలు, వీడియోలను చూస్తారు. మహిళలు అలా కనిపించడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబన్ ప్రభుత్వం) అంగీకరించదు. అందువల్ల మహిళలకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతివ్వటం లేదు"
- అహ్మదుల్లా వాసిఖ్, తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్
అఫ్గాన్ క్రికెట్ బోర్డు గతేడాదే 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు ఇచ్చింది. ఇప్పుడు వారి భవితవ్యంపై ఆందోళన నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఆ దేశ మహిళా ఫుట్‌బాల్ జాతీయ జట్టు సభ్యులు తమ జెర్సీలను తగలబెట్టినట్లు వార్తలు వచ్చాయి.
చదువులపైనా ఆంక్షలు..
చదువుకునే అమ్మాయిలపైనా తాలిబన్లు ఆంక్షలు విధించారు. అమ్మాయిలకు పురుషులు బోధించొద్దని విద్యాసంస్థలను ఆదేశించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నికాబ్ ధరించాలని, క్లాసుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరదా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అబ్బాయిలు క్యాంపస్ నుంచి పూర్తిగా బయటకు వెల్లిన తర్వాతే అమ్మాయిలను పంపించాలని ఆదేశించారు.
పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువలేదు: విద్యాశాఖ మంత్రి
అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునే కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వి నూరుల్లా మునీర్. 'పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు ఈ రోజు విలువలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ముల్లాలు, తాలిబన్లు ఎవరికీ పీహెచ్‌డీలు, ఎంఏ లేదా కనీసం ఉన్నత పాఠశాల డిగ్రీ కూడా లేదు. కానీ, వారు గొప్ప స్థానంలో ఉన్నారు.' అని పేర్కొన్నారు. తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదాను సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
జర్నలిస్టుల అరెస్ట్‌లు
అఫ్గాన్‌లో తాలిబన్లకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై వార్తలు అందిస్తున్న జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటున్నారు తాలిబన్లు. మంగళవారం కాబుల్‌లో జరిగిన ఆందోళనలను లైవ్ కవరేజీ చేసిన పదుల సంఖ్యలో జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వారిపై దాడి చేసి క్షమాపణలు చెప్పించినట్లు పలు వార్తా సంస్థలు తెలిపాయి.
తాజాగా.. కాబుల్‌లోని డైలీ న్యూస్‌పేపర్ ఎటిలాట్రోజ్కు చెందిన ఐదుగురు జర్నలిస్టులను తాలిబన్లు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: మా పాలన ఇలా ఉంటుంది... తాలిబన్ల కీలక ప్రకటన
Haqqani Taliban: పాక్ స్క్రీన్ ప్లే.. హక్కానీల హైడ్రామా!