ETV Bharat / international

చైనా విమాన ప్రమాదంలో మొత్తం 132 మంది మృతి! - international news

China Plane Crash: చైనా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా తెలియలేదని అధికారులు తెలిపారు. సోమవారం విమానం కుప్పకూలిన సమయంలో మొత్తం 132మంది ఉన్నారు. వందల మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ ఒక్కరి ఆనవాళ్లు కూడా కన్పించకపోవడం ఆందోళన కల్గిస్తోంది.

చైనా విమాన ప్రమాదం
China Plane Crash
author img

By

Published : Mar 22, 2022, 1:29 PM IST

Plane Crash Survivors: సోమవారం చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఆందోళనకర విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా 132 మంది ఉన్నప్పటికీ... ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా తెలియలేదని అధికారులు తెలిపారు. అనేక గంటలుగా గాలింపు చేపడుతున్నా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కన్పించడం లేదని పేర్కొన్నారు. సహాయక చర్యలు మాత్రం యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే 132మంది పరిస్థితిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలిపే బ్లాక్​బాక్స్ ఆచూకీపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్​ ఎయిర్​లైన్స్​కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.

ఈ ప్రమాదంతో చైనా ఎయిర్​లైన్స్ రికార్డుకు కూడా బ్రేక్ పడింది. వరుసగా 100 మిలియన్​ గంటలకు పైగా ఆ దేశంలో ఎలాంటి విమాన ప్రమాద ఘటన జరగలేదు. 2010లో చివరి సారి హిలాంగ్​జియాంగ్ రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో 42 మంది చనిపోయారు.

సోమవారం ఘటన..

132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. చైనా ఈస్టర్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 737 విమానం.. కున్​మింగ్​ నుంచి గువాంగ్​ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలినప్పుడు పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్దం వినిపించిందని, ఆ తర్వాత క్షణాల్లోనే పేలుడు సంభవించిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. విమానంలో మొత్తం 132 మంది ఉండగా.. అందులో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది.

600 మంది అగ్నిమాపక సిబ్బంది

ప్రమాదం అనంతరం వూఝౌ అగ్నిమాపక విభాగం.. 117 మంది సిబ్బందిని, 23 అగ్నిమాపక యంత్రాలను సంఘటనాస్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టింది. విమాన ప్రమాదం, బాధిత కుటుంబాలకు సాయం అందించే విషయంపై తొమ్మిది బృందాలను ఎయిర్​లైన్స్​ ఏర్పాటు చేసినట్లు చైనా మీడియా తెలిపింది.

ఇదీ చదవండి: 'ఇమ్రాన్​ఖాన్ ఆట ముగిసింది.. అతడే పాక్​ కొత్త ప్రధాని!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.