ETV Bharat / international

'కశ్మీర్‌ పరిష్కారమైతే... అణ్వాయుధాలక్కర్లేదు' - భారత్ పాక్ కశ్మీర్ సమస్య

ఒక్కసారి కశ్మీర్‌ పరిష్కారమైతే.. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు అక్కర్లేదన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. అమెరికా మనసు పెట్టి, తలచుకుంటే.. కశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు. అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకుంటే.. అబ్బాయిలపై ప్రభావం పడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

India pak Kashmir issue
కశ్మీర్ సమస్య
author img

By

Published : Jun 22, 2021, 6:40 AM IST

Updated : Jun 22, 2021, 7:18 AM IST

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌ను పదే పదే వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా కశ్మీర్‌ వివాదం పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరమే ఉండదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పాక్‌ ప్రధాని తాను అణ్వాయుధాలకు పూర్తి వ్యతిరేకమని డాంబికాలు పలికారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం చేసుకోవాలన్న ఇమ్రాన్‌.... ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిప్పుడు తాను సంసిద్ధం వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే కశ్మీర్‌ అంశంపై.. మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్‌ గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.

ఆత్మర‌క్షణ కోసమే..

కశ్మీర్‌ వివాదంపై స్పష్టత వస్తే.. ఇరు దేశాల ప్రజలు స్నేహపూర్వకంగా జీవించే అవకాశం ఉంటుందని ఇమ్రాన్‌ అన్నారు. పాక్‌ అత్యంత వేగంగా అణ్వాయుధాలను సమీకరిస్తోందంటూ నిఘా వర్గాల నివేదికపై స్పందించిన ఇమ్రాన్‌.. ఆ స‌మాచారం వారికి ఎక్కడ నుంచి వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అణ్వాయుధాలు.. కేవ‌లం ఆత్మర‌క్షణ కోసమే ఉన్నట్లు చెప్పారు.

అమ్మాయిలు రెచ్చగొట్టొద్దు..

అమ్మాయిలు రెచ్చగొట్టే రీతిలో పొట్టి దుస్తులు వేసుకుంటే అబ్బాయిలపై ప్రభావం పడుతుందని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. "కురచ బట్టలు వేసుకునే అమ్మాయిలను చూస్తే అబ్బాయిలపై ప్రభావం పడకుండా ఉండదు.. వారు రోబోలైదే తప్ప! అలాంటి వస్త్రాలు ధరించకపోవడం ద్వారా లైంగిక దాడుల్ని నివారించుకోవచ్చు. రెచ్చగొట్టే వైఖరిని నివారించాలంటే పర్దాలు ధరించాలి" అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్ని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ తీవ్రంగా ఖండించింది.

ఇదీ చూడండి: ఆక్రమిత కశ్మీర్​లో పాక్‌ కుట్ర!

Last Updated : Jun 22, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.