ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై.. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో అనేక కథనాలు ప్రచురితమవుతున్నా.. ఆ దేశం మౌనాన్ని వీడడం లేదు. ఏప్రిల్ 15న తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ జయంతి వేడుకల్లో కిమ్ పాల్గొనలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రారంభమయ్యాయి. 2011లో అధికారం చేపట్టిన నాటి నుంచి కిమ్ జోంగ్ ఉన్.. సుంగ్ జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడం అదే తొలిసారి.
తర్వాతి నాయకుడు ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా పలు రకాల కథనాలు వెలువడుతున్నా కిమ్ ఆరోగ్యంపై వదంతులను ఉత్తరకొరియా ప్రభుత్వం ఖండించకపోవడం వల్ల ఈ కథనాలకు బలం పెరుగుతోంది. కిమ్ ఆరోగ్యం నిజంగానే క్షీణిస్తే.. కిమ్ తర్వాత ఉత్తర కొరియాకు నాయకత్వం వహించేది ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తరకొరియా అధినేత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాజవంశ పాలన అంతం..
కిమ్ తర్వాత తరతరాలుగా వస్తున్న రాజవంశ పాలన అంతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు..