పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీని తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. అప్పగింత విన్నపాన్ని బ్రిటన్ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
గత సంవత్సరం ఆగస్టులో ఈడీ, సీబీఐ నుంచి వచ్చిన సమాచారంతో నీరవ్ మోదీని అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరాం. యూకే మన ప్రతిపాదనపై స్పందించాల్సి ఉంది లేదా ఇంకా పరిశీలనలోనే ఉంది.
- రవీష్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
అద్దె 15 లక్షలు, చొక్కా 10 లక్షలు...
నీరవ్ మోదీ బ్రిటన్‌లో 80 లక్షల డాలర్లు విలువచేసే విలాసవంతమైన అపార్టమెంట్లో నివాసం ఉంటున్నట్లు శనివారం బ్రిటన్ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. 17వేల పౌండ్ల అద్దె చెల్లిస్తున్నట్లు ఈ కథనం అంచనా వేసింది.
ఇదీ చూడండి :ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు