ETV Bharat / international

ఇండోనేషియా చర్చి దాడిలో ఉగ్రవాద దంపతులు!

ఇండోనేసియాలో ఓ చర్చిపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఉగ్రవాద జంట హస్తం ఉందని దర్యాప్తు బృందాలు ప్రకటించాయి. దాడిలో పాల్గొన్న వీరు నూతనంగా వివాహం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నాయి.

Newlywed militant suspects blamed in Indonesia church attack
ఇండోనేసియా చర్చి దాడిలో ఉగ్రవాద దంపతులు
author img

By

Published : Mar 29, 2021, 9:34 PM IST

ఇండోనేసియా సులవేసి ఐలాండ్​లోని రోమన్​ క్యాథలిక్​ చర్చిపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఉగ్రవాద జంట హస్తం ఉందని దర్యాప్తు బృందాలు ప్రకటించాయి. ఆదివారం ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు నూతనంగా వివాహం చేసుకున్న దంపతులని పోలీసులు తెలిపారు.

నిందితులు ప్రెజర్​ కుక్కర్​ బాంబులతో ఆత్మాహుతికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన దంపతులకు ఉగ్రవాద మూలాలతో సంబంధం ఉందన్నారు. ఈ జంట ఆరు నెలల క్రితమే వివాహం చేసుకుందని తెలిపారు. 23-26 సంవత్సరాల మధ్య ఉన్న వీరిని లుక్మాన్.. అతని భార్య దేవిగా గుర్తించారు. మకాస్సార్‌లోని వారి నివాసాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జెమా అన్షోరుత్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్​కు విధేయత ప్రకటించి ఇండోనేషియాలో కార్యకలాపాలు సాగిస్తోందీ సంస్థ.

అడ్డుకున్న సిబ్బంది..

మొదట చర్చిలోపలికి రావడానికి ప్రయత్నించిన వీరిని కాపలాసిబ్బంది అడ్డుకున్నారని.. దీంతో బాంబు పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆదివారం జరిగిన ఈ దాడిలో నలుగురు చర్చి సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. చర్చితో పాటు, సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనను ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఖండించారు. ఏ మతమైనా ఉగ్రవాదాన్ని సహించదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందుతులను, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటి మూలాలను ఛేదించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి: ఆపరేషన్ సూయిజ్ సక్సెస్- కదిలిన ఎవర్​ గివెన్ నౌక

భారత్​-పాక్​ స్నేహగీతంపై చైనా హర్షం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.