ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్‌: మాస్కుతోనే కొత్తజంటల తొలిముద్దు - corona latet updates

వాలెంటైన్స్ డే అనంతరం ఫిలిప్పీన్స్​లో సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఓ కార్యక్రమం ద్వారా 220 జంటలు ఒక్కటయ్యాయి. అయితే కరోనా ప్రభావం కారణంగా వీరంతా ముసుగులు ధరించి వివాహం చేసుకున్నారు. తమ భాగస్వామిపై మాస్క్​లతోనే తొలిముద్దుతో ప్రేమను వ్యక్తపరిచారు.

newly married couple kissed with mask
కరోనా ఎఫెక్ట్‌: మాస్కుతోనే కొత్తజంటల తొలిముద్దు
author img

By

Published : Feb 22, 2020, 5:37 AM IST

Updated : Mar 2, 2020, 3:34 AM IST

చైనాలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో అనేక శుభకార్యాలు రద్దు చేసుకున్నారు ప్రజలు. ఫిలిప్పీన్స్​లో కూడా పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాలంటైన్స్‌ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్‌ పట్టణంలో సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టింది స్థానిక ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 220జంటలు ఒక్కటయ్యాయి. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆ వేడుక జరిగే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లని వస్త్రాలు ధరించిన నూతన వధూవరులతో ఆ ప్రదేశం శ్వేతమయం అయ్యింది.

కరోనా ఎఫెక్ట్‌: మాస్కుతోనే కొత్తజంటల తొలిముద్దు

మాస్క్​తో తొలిముద్దు

ఇదంతా బాగానే ఉంది కానీ, వారి ముఖాలకు నీలి రంగు మాస్కులు కట్టుకోవడంతో అక్కడ కొత్త వాతావరణం ఏర్పడింది. ఇలా ధరించిన మాస్కులతోనే వివాహం చేసుకున్న నూతన దంపతులు, వారి మొదటి చుంబనంతో భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. వివాహ జీవితాన్ని ఇలా జాగ్రత్త పాటిస్తూ ఆరంభించడం సంతోషంగా ఉందన్నారు. మాస్కుతో ముద్దు పెట్టుకోవడం వింత అనుభూతినిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు నూతన దంపతులు.

వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారిని నిశితంగా పరిశీలించి 14 రోజుల గడువు అనంతరం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిచ్చామన్నారు నిర్వాహకులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిలో పాల్గొనే ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు అందించిన అధికారులు.. తమ పట్టణం ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ పట్టణంలో 2013 సంవత్సరంలో దాదాపు 2013 జంటలు ఒక్కటై రికార్డు సృష్టించాయి.

Last Updated : Mar 2, 2020, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.