న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో ఓ ఉగ్రవాది(New Zealand terror attack) బీభత్సం సృష్టించారు. ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడి ఆరుగురు వ్యక్తులను కత్తితో పొడిచి గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... అతడ్ని మట్టుబెట్టారు.
ఈ ఘటనను న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ ఖండించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని చెప్పారు. శ్రీలంకకు చెందిన సదరు ముష్కరుడికి.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ముష్కరుల దాడిని ఎదుర్కొనేందుకు తమ నిఘా విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో(Lockdown in new zealand) కఠిన లాక్డౌన్ విధించారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే ప్రజల్ని అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ మార్కెట్లో ప్రజలు సరకులు కొనుగోలు చేస్తుండగా.. ఈ ఉగ్రదాడి జరిగింది.
ఇదీ చూడండి: 3 రోజుల్లో తాలిబన్ సర్కార్- సుప్రీం లీడర్‌గా అఖుంద్ జాదా