ETV Bharat / international

న్యూజిలాండ్​లో మళ్లీ పెరుగుతున్న కేసులు- ఆ వేరియంట్​ వల్లే! - న్యూజిలాండ్ డెల్టా వేరియంట్​

కరోనాను విజయవంతంగా కట్టడి చేసిన న్యూజిలాండ్​లో (new zealand news) డెల్టా వేరియంట్ వ్యాప్తితో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 207 మందికి పాజిటివ్​గా తేలింది(new zealand corona cases).

New Zealand reports 207 new cases of Covid-19
డెల్టా వేరియంట్​తో న్యూజిలాండ్​లో మళ్లీ పెరుగుతున్న కేసులు
author img

By

Published : Nov 6, 2021, 10:17 AM IST

Updated : Nov 6, 2021, 11:48 AM IST

న్యూజిలాండ్​లో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి(new zealand corona cases). వీటిలో 206 స్థానికంగా వెలుగుచూసివని కాగా.. ఒక్క కేసు సరిహద్దులో వేరే ప్రాంతానికి చెందింది. న్యూజిలాండ్​లో కొద్దిరోజుల క్రితం కరోనా కేసులు సున్నాగా ఉన్నప్పటికీ.. డెల్టా వేరియంట్​ వ్యాప్తి మొదలైన తర్వాత(new zealand delta variant) కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి ఆ దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 4,240కి చేరింది. వీటిలో ఆక్లాండ్​లోనే 4,047 కేసులున్నాయి. వైకాటోలో 154, వెల్లింగ్టన్​లో 17, నార్తాలాండ్​లో 17, కౌంటర్​బురీలో 4, నెల్సన్-మార్ల్​బోరోలో ఒక్క కేసు నమోదయ్యాయి.

కరోనా బాధితుల్లో 73మంది వివిధ ఆస్పత్రులతో చికిత్స పొందుతున్నట్లు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ తెలిపింది(new zealand news). వీరిలో ఏడుగురు ఐసీయూలో ఉన్నట్లు పేర్కొంది. కరోనాను అత్యంత విజయవంతంగా కట్టడి చేసిన ఈ దేశంలో(new zealand covid) ఇప్పటివరకు మొత్తం 7,138 కేసులే నమోదయ్యాయి. 29 మంది మరణించారు.

న్యూజిలాండ్​లో కరోనా టీకాకు అర్హులైన 78 శాతం మంది ప్రజలు(new zealand covid free) పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇదీ చదవండి: ఆ జన్యువుతో కరోనా మరణముప్పు రెట్టింపు- మనలోనే ఎక్కువట!

Last Updated : Nov 6, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.