ETV Bharat / international

'కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్' - శునకాల్లో కరోనా

కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడినట్లు మలేసియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు చెందిన పత్రాలు క్లినికల్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది వ్యాధికారకమని గుర్తిస్తే జంతువుల నుంచి మనుషులకు సోకే ఎనిమిదో వైరస్‌ అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

dogs
కుక్క
author img

By

Published : May 22, 2021, 7:23 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌లో అనేక రకాలున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్‌ బయటపడినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 2017-18లో న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వారిలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించామని పరిశోధకులు తెలిపారు. తాజాగా ఈ పరిశోధనకు చెందిన పత్రాలు క్లినికల్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ వైరస్‌ వ్యాధికారకమని గుర్తిస్తే జంతువుల నుంచి మనుషులకు సోకే ఎనిమిదో వైరస్‌ అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

కానైన్‌ వైరస్​..

మలేసియాలోని సార్వాక్‌ చెందిన ఓ ఆస్పత్రిలో 301 రోగుల నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 8 మంది పిల్లల్లో కానైన్‌ కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా సీసీవోవీ-హెచ్‌యూసీఎన్‌-2018 అనే రకం కరోనా వైరస్‌ సాధారణంగా పిల్లులు, పందులకు వ్యాపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో కుక్కలు కూడా దీని బారిన పడతారని వారు పేర్కొన్నారు. మానవుల్లో ఉండే కరోనా వైరస్‌ను సార్స్‌-కోవ్‌2 గా పరిగణిస్తే జంతువుల్లో దీని మ్యుటేషన్లు వేరుగా ఉంటాయని వారు తెలిపారు. అయితే తాజాగా ఈ వైరస్‌ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్నట్లు సూచనలు కనిపించాయని పరిశోధకులు అన్నారు. ఇది ప్రజల మధ్య వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకొనేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు ఉద్ఘాటించారు.

ఇప్పటి వరకు మానవుల్లో వ్యాధికి కారణమయ్యే ఏడు కరోనా వైరస్‌లు ఉన్నాయి. వాటిలో నాలుగు జలుబుకు కారణమవుతాయి. మరో మూడు వైరస్‌లు సార్స్‌, మెర్స్‌, కొవిడ్‌-19కు కారణమవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది.

ఇదీ చదవండి : 'పీ305' దుర్ఘటనలో 60కి పెరిగిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.