ETV Bharat / international

నేడే ఓలి భవితవ్యం తేల్చే స్టాండింగ్​ కమిటీ భేటీ - నేపాల్​ రాజకీయాలు

నేపాల్​ ప్రధానంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యాన్ని నిర్దేశించే కీలక స్టాండింగ్​ కమిటీ సమావేశం నేడు జరగనుంది. అయితే పార్టీ సీనియర్లతో ఓలికి సయోధ్య కుదరకపోవడం, ఇప్పటివరకు జరిగిన సమావేశాలు విఫలమవడం.. ప్రధానికి ప్రతికూల అంశాలు. ఈ నేపథ్యంలో స్టాండింగ్​ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

NCP's key body meets to end Oli-Prachanda infighting
నేడు స్టాండింగ్​ కమిటీ భేటీ- ఓలి భవితవ్యంపై ఉత్కంఠ
author img

By

Published : Jul 19, 2020, 5:36 AM IST

నేపాల్​లో అధికార కమ్యూనిస్ట్​ పార్టీ.. స్టాండింగ్​ కమిటీ సమావేశం నేడు జరగనుంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజానికి ఈ స్టాండింగ్​ కమిటీ సమావేశం ఇంతకుముందే జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఐదుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ భేటీ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది.

కుదరని సయోధ్య...

ఇటీవలి కాలంలో నేపాల్​ ప్రధాని ఓలి, పార్టీ కో-చైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు శనివారం జరిగిన సమావేశం కూడా విఫలమైంది. ఏకధాటిగా నాలుగు గంటలపాటు చర్చలు జరిగినప్పటికీ లాభం లేకుండా పోయింది.

ఇదీ చూడండి:- ప్రధాని నయా వేదాంతం.. రాముడు నేపాలీ అట!

అయితే.. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవడానికి.. ఈ 9 మందితో కూడిన కేంద్ర సెక్రటేరియట్​ సమావేశంలో నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది.

మొత్తం మీద ఓలి-ప్రచండ మధ్య సమస్య పరిష్కారానికి 8సార్లు చర్చలు జరిగాయి. కానీ ఏవీ ఫలితాల్ని ఇవ్వకపోవడం గమనార్హం.

ఇదీ జరిగింది...

ఇటీవలే భారత్​లోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్​పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్​ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రచండ సహా పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.