ETV Bharat / international

'కరోనా ఫ్రీ దేశం'గా ప్రకటించిన మంత్రికి వైరస్‌!

నేపాల్‌ను కరోనా వైరస్‌ లేని దేశంగా అభివర్ణించిన మంత్రి యోగేష్ భట్టారాయ్​కి పాజిటివ్​గా తేలింది. నేపాల్‌ మంత్రి వర్గంలో కరోనా బారినపడిన తొలి మంత్రి కూడా ఈయనే. ఇప్పటికే ప్రధానమంత్రి సన్నిహితులు ఎనిమిది మందిలో వైరస్‌ బయటపడింది. వీరిలో ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్యుడు, ఫొటోగ్రాఫర్‌, మీడియా ఎక్స్‌పర్ట్‌తోపాటు మరికొందరు సన్నిహితులకు వైరస్‌ సోకింది. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Nepals-Minister-Once-Declared-Country-Covid-Free-test-positive
కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించిన మంత్రికి వైరస్‌!
author img

By

Published : Oct 12, 2020, 7:28 AM IST

నేపాల్‌ పర్యటకశాఖ మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో నేపాల్‌ను కరోనా వైరస్‌ లేని దేశంగా అభివర్ణించిన మంత్రే చివరకు వైరస్‌ బారినపడటం గమనార్హం. నేపాల్‌ మంత్రి వర్గంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి మంత్రి కూడా ఈయనే. ఈ సమయంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు ఎవరైనా అస్వస్థతకు గురైతే..వెంటనే కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని యోగేష్‌ సూచించారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో యోగేష్‌ భట్టారాయ్‌ ఒకరు. ఇప్పటికే ప్రధానమంత్రి సన్నిహితులు ఎనిమిది మందిలో వైరస్‌ బయటపడింది. వీరిలో ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్యుడు, ఫొటోగ్రాఫర్‌, మీడియా ఎక్స్‌పర్ట్‌తో పాటు మరికొందరు సన్నిహితులకు వైరస్‌ సోకింది. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా-ఫ్రీ దేశంగా ఉంటుందన్న మంత్రి‌..

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. కరోనా వైరస్‌ లేని దేశంగా నేపాల్‌ ఉంటుందని మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ ప్రకటించారు. 'కరోనా వైరస్‌ నీడ పడకుండా నేపాల్‌ స్వేచ్ఛగా ఉందనే విషయాన్ని యావత్‌ ప్రపంచానికి తెలియజేయాలి'అని గత ఫిబ్రవరిలో నెలలో యోగేష్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయనకే వైరస్‌ సోకింది. అయితే, నేపాల్‌లో పర్యటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే యోగేష్‌ ఆ విధంగా స్పందించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ముందురోజే భారత రాయబారితో భేటీ..

కరోనా వైరస్‌ నిర్ధరణ కావడానికి ముందురోజే యోగేష్‌ భట్టారాయ్ భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో యోగేష్‌ ముఖానికి మాస్కు లేకుండానే ఉన్నారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పెంచడంతోపాటు పర్యటక ప్రాంతాల అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించామని ఇరువురూ వెల్లడించారు. తాజాగా నేపాల్‌ మంత్రికి కరోనా సోకిందని తేలడం వల్ల ముందుజాగ్రత్తగా భారత రాయబారి వినయ్‌ మోహన్ కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.