తమ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీకా సేకరణకు చర్యలు ముమ్మరం చేస్తోంది. నేపాల్. ఈ క్రమంలో తమ దేశానికి వ్యాక్సిన్ అందించాలని భారత్‌ను అభ్యర్థించింది. దేశంలో 20 శాతం మందికి సరిపడా టీకాలు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తూ భారత్‌కు లేఖ రాసిందని భారత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
టీకా అందుబాటులోకి వస్తే.. నేపాల్ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని గతంలోనే భారత్ హామీ ఇచ్చారు.
ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా సహా దేశీయంగా తయారైన భారత్ బయోటెక్ టీకాలు భారత్‌లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న నేపథ్యంలో నేపాల్ ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఇతర దేశాల్లో మూడోదశలో ఉన్న టీకాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది నేపాల్. ఇప్పటికే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలకు దౌత్య లేఖలు పంపింది.
ఇదీ చూడండి: పోర్ట్ బ్లెయిర్‌లో జెండా ఆవిష్కరించిన ప్రధాని