ETV Bharat / international

మళ్లీ అదే కథ- ఓలి భవితపై వీడని సస్పెన్స్ - నేపాల్​ రాజకీయాలు

నేపాల్​లో అధికార కమ్యూనిస్ట్​ పార్టీ స్టాండింగ్​ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. ప్రధాని ఓలి- పార్టీ కో చైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ మధ్య సయోధ్య కుదిర్చేందుకే సమావేశాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 11గంటలకు ఈ స్టాండింగ్​ కమిటీ సమావేశం ఉంటుందని పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Nepal ruling party's Standing Committee meeting postponed for two more days
ప్రశ్నార్థకంగానే ఓలి రాజకీయ భవితవ్యం
author img

By

Published : Jul 19, 2020, 5:36 PM IST

నేపాల్​ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యాన్ని తేల్చే అధికార కమ్యూనిస్ట్​ పార్టీ స్టాండింగ్​ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. ప్రధాని ఓలి, పార్టీ కో-చైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని.. ఆదివారం ఉదయం జరిగిన అనధికారిక సమావేశంలో నిర్ణయించారు నేతలు.

స్టాండింగ్​ కమిటీ సమావేశం వాయిదా పడటం ఇది వరుసగా 7వ సారి. తాజాగా.. ఆదివారం మధ్యాహ్నం జరగాల్సిన ఈ భేటీ మంగళవారం ఉదయం 11గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

ఇదీ చూడండి:- 'నన్ను పదవి నుంచి దించేందుకు భారత్​ యత్నం'​

భారత్​తో విభేదాలతో...

ఇటీవలే భారత్​లోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​ కమ్యూనిస్ట్​ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్​ను నేపాల్​ పార్లమెంట్​లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్​ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్​పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్​ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఓలి- ప్రచండ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. భారత్​తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రచండ సహా పార్టీలోని సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.